పుదుచ్చేరి ఎన్నికల వేళ ఇవాళ (ఏప్రిల్ 4న) టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఓ వృద్ధుడిని భద్రతా సిబ్బంది వృద్ధుడిని తోసేశాడు. దీంతో భద్రతా సిబ్బందిపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆ రోడ్ షోలో విజయ్‌ను చూడటానికి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వ్యానుపై ఉన్న విజయ్‌ను చూడడానికి ప్రజలు ఆయనకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అక్కడి జనసమూహాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఒక వృద్ధుడు.. విజయ్ వ్యానును దగ్గరగా వచ్చాడు.
ఈ విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఆ వృద్ధుడిని తోసినట్టు ఈ వీడియోలో కనపడుతోంది. వెంటనే విజయ్ అది గమనించాడు. ఆ సిబ్బందిని చూసి అలా ప్రవర్తించవద్దని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుడితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల విజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఘటన కెమెరాలో రికార్డయింది. విజయ్ అభిమానులు, మద్దతుదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. విజయ్ వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని అంటున్నారు. ఆ పరిస్థితిలో వృద్ధుడి పక్షాన విజయ్ నిలబడ్డారని అంటున్నారు. విజయ్ రోడ్ షోలకు ప్రజలు భారీగా వస్తున్నారు.
Thalapathy Vijay was angry with the security for pushing an elderly man 🥹🥹 pic.twitter.com/SkbSPXd08P
— Vijay Fans Trends (@VijayFansTrends) April 4, 2026


