ఉద్రిక్తత: ఖానాపూర్‌ చైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా | Khanapur Chairman Election Postponed Again | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తత: ఖానాపూర్‌ చైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా

Apr 4 2026 3:54 PM | Updated on Apr 4 2026 4:20 PM

Khanapur Chairman Election Postponed Again

నిర్మల్: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.  చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 7పై గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థి మౌనికకు ఏడుగురు కౌన్సిలర్ల మద్దతు ఇవ్వడంతో చైర్మన్‌గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. అయితే ఎన్నికల సమయంలో తమకు ఏడుగురు మద్దతు తెలిపారని కాంగ్రెస్‌ ఎక్స్‌ అఫీషియో మెంబర్‌ వెడ్మ బొజ్జు నిరసనకు దిగారు. దాంతో గందరగోళం నెలకొంది.  ఈ నేపథ్యంలో  ఎన్నికను రేపటి వాయిదా వేశారు ఎన్నికల అధికారులు. 

ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయడం పట్ల బీఆర్‌ఎస్‌, బీజేపీ  నాయకులు మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్ ఎన్నుకోవడానికి సరిపడ కోరం ఉన్న ఎన్నికను నిర్వహించకుండా అధికారులు ఎన్నికను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించిన కౌన్సిలర్లు. వారికి మద్దతుగా బైఠాయించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, బీఆర్‌ఎస్‌ ఖానాపూర్ నియోజక వర్గం ఇంచార్జ్ జాన్సన్ నాయక్. కలెక్టర్ వచ్చి ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికను నిర్వహించాలి, లేదంటే ఇక్కడనే చస్తాం కానీ లేవమాని తేల్చి చెప్పారు కౌన్సిలర్లు. 

దాంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించిన బీజేపీ 8 వార్డ్ కౌన్సిలర్ బొప్పారావు సత్యవతి కళ్లుతిరిగి కిందపడిపోయారు.  సాటి కౌన్సిలర్లు ఆమెకు నీళ్లు ముఖంపై కొట్టి మంచి నీళ్లు అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement