నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, అందుకే మన పోలీసులు దేశంలో చివరి ర్యాంకులో ఉన్నారని మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఎక్కడ చూసినా మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళలకు ప్రతి రక్షణ కల్పించామనే విషయాన్ని గుర్తుచేశారు విడదల రజిని. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేశారని, అందుకే పోలీసింగ్ లో మన రాష్ట్రం దేశంలోనే మొదటి ర్యాంకులో నిలిచిందనే విషయాన్ని స్సష్టం చేశారు.
ఆ సమయంలో ఎన్నో బెస్ట్ అవార్డులు మన పోలీసులు అందుకున్నారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనను నడిపిస్తుందని, అందుకే దేశంలో చివరి స్థానంలో మన పోలీస్ వ్యవస్థ నిలిచిందన్నారు.


