కార్వేటినగరంలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు | Karvetinagaram: Tdp Leaders Attack On Ar Constable | Sakshi
Sakshi News home page

కార్వేటినగరంలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు

Apr 4 2026 1:41 PM | Updated on Apr 4 2026 3:10 PM

Karvetinagaram: Tdp Leaders Attack On Ar Constable

సాక్షి, చిత్తూరు జిల్లా: కార్వేటినగరం మండలంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్‌పై దాడి చేసి.. హత్య చేసేందుకు టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ ఆదాము, ప్రవీణ్, భాగ్య రాజ్ కుట్ర చేశారు. టీడీపీ నాయకుల అక్రమ గ్రావెల్ దందాను ప్రశ్నించినందుకు దాడికి పాల్పడ్డారు.

కార్వేటినగరం మండలం అల్లాగుంట  గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ తన భార్య చంద్రకళను కృష్ణ సముద్రంలో దించి వస్తుండగా మార్గ మధ్యలో అమ్మపల్లి క్రాస్‌ వద్ద కాపుకాసి టీడీపీ నేత, అన్నూరు మాజీ సర్పంచ్ ఆదాము(సుందర్ రాజ్), మెట్ట హరిజనవాడకు చెందిన ప్రవీణ్ కుమార్, భాగ్య రాజ్ దాడి చేశారు.

ద్విచక్ర వాహనంపై వస్తుండగా అడ్డుకున్న టీడీపీ నేతలు.. కానిస్టేబుల్‌పై పిడుగు గుద్దులతో తీవ్రంగా గాయపరిచారు. దీంతో కానిస్టేబుల్ యుగంధర్.. కోమాలోకి వెళ్లారు. ఆయన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. యుగంధర్‌ భార్య చంద్రకళ.. కార్వేటి నగరం పోలీసులకు ఫిర్యాదు  చేశారు.

చిత్తూరు జిల్లాలో టీడీపీ బరితెగింపు కానిస్టేబుల్ యుగంధర్ పై దాడి

Advertisement
 
Advertisement
Advertisement