కడవరకూ కాంగ్రెస్‌లోనే..: ఎమ్మెల్యే వీరయ్య 

Telangana: MLA Podem Veeraiah Comments On Congress Party - Sakshi

మణుగూరు టౌన్‌: బతికున్నంత కాలం తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టంచేశారు. మణుగూరులో శుక్రవారం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ భద్రాచలం ప్రజలే తనకు దేవుళ్లని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం, దేశంలో కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్‌లో బీజేపీ గెలిచినంత మాత్రాన ఆ ప్రభావం అంతటా ఉండదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ చందా లింగయ్య తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top