
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీని తాజాగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు వెల్లడించారు. 22 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఏడు మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శిల్పారెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడిగా గణేష్, బిసి మోర్చా అధ్యక్షుడిగా ఆనంద్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మీ నర్సయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా రవి నాయక్‌లను నియమించారు.
అదే సమయంలో ఎనిమిది మంది వైస్ ప్రెసిడెంట్‌లు, ముగ్గురు జనరల్ సెక్రటరీలు, ఏడుగురు సెక్రటరీలు.ట్రెజరరి, జాయింట్ ట్రెజరరీ, చీఫ్ స్పొక్స్ పర్సన్స్‌ను నియమించారు. ప్రధాన కార్యదర్శలుగా వీరేందర్ గౌడ్, గౌతమ్ రావు, వేముల అశోక్‌లను నియమించారు. ఇక కార్యదర్శలుగా ఓ శ్రీనివాస్‌రెడ్డి, కొప్పు భాషా, బండారు విజయలక్ష్మి, స్రవంత్‌రెడ్డి, పరిణిత, బద్ధం మహిపాల్‌ను, ఉపాధ్యక్షులుగా బూరి నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, కొల్లి మాధవి, జయశ్రీ, కళ్యాణ్ నాయక్, రఘునాథరావు, బండ కార్తీకరెడ్డిలను ఎంపిక చేశారు. కోశాధికారిగా వాసుదేవ్‌ను నియమించారు.