
విజయనగరం గంటస్తంభం: వామపక్షాల నేతలు ఇతర పార్టీలను ఒక్క మాట అనరని.. బీజేపీ ఎన్ని మంచి పనులు చేసినా తీవ్ర విమర్శలు చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఆదివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, వైఎస్ జగన్ అంటే వామపక్షాలకు ప్రేమ ఎక్కువన్నారు.
ప్రధాని మోదీ మాత్రం వారికి నచ్చరన్నారు. రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీలు, జూట్ పరిశ్రమలు మూతపడినా ఏమీ మాట్లాడరని.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేస్తున్నారని మాత్రం తెగ గోల చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఏటా నిధులు విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.