మోదీకి సీఎం కేసీఆర్‌ ఏకలవ్య శిష్యుడు: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Fires On KCR Over CM Skips Niti Aayog Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను కేసీఆర్‌ బహిష్కరించడం ఎందుకని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి కేసీఆర్‌ వెళ్తే ప్రధానిని ముఖాముఖిగా ప్రశ్నించే అవకాశం ఉండేది కదా అని అ‍న్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుతారని భావించినట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శనివారం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి, కేసీఆర్‌కు చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు.

జీఎస్టీ బిల్లు తెచ్చినప్పుడు మోదీని కేసీఆర్‌ పొగిడారని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు.  ఏడున్నరేళ్లుగా కేసీఆర్‌.. మోదీతో కలిసి నడిచారని గుర్తు చేశారు. కేసీఆర్‌ మాటలు వ్యతిరేకంగా కనిపిస్తున్నా.. చర్యలు మోదీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మోదీకి కేసీఆర్‌ ఏకలవ్య శిష్యుడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

‘కేంద్రంలో ఈడీలాగే, ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ను తన వ్యతిరేకులపై కేసీఆర్‌ ప్రయోగిస్తున్నారు. తెలంగాణలో దర్యాప్తు నిఘా వ్యవస్థలను ప్రతిపక్షాల్ని టార్గెట్‌ చేయడానికి ఉపయోగిస్తున్నారు. నీతి ఆయోగ్‌ మీటింగ్‌కు స్వయంగా కేసీఆర్‌ హాజరు కావాలి. ప్రధానిని నిలదీయడానికి వచ్చిన ఛాన్స్‌ను ఉపయోగించుకోవాలి.
చదవండి: ప్రధానికి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్‌

పార్టీ మారుతున్న వాళ్లపై కొన్నిప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. బీజేపీ ఇంకొంత మంది కోవర్టులను తయారు చేయవచ్చు. కండువా కప్పుకున్నాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. స్థాయి లేకపోయినా వేదికపై కాలుమీద కాలువేసుకొని కూర్చుంటారు. పీసీసీ చీఫ్‌గా నాకే చాలాసార్లుకుర్చీ ఇవ్వరు.. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటుంది. రాజకీయాల్లో సందర్భాలు, పదవులు మారుతాయి.’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top