Ponguleti Srinivasa Reddy Sensational Comments On BRS Party - Sakshi
Sakshi News home page

Ponguleti: పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jan 10 2023 2:54 PM | Updated on Jan 10 2023 3:44 PM

Ponguleti Srinivasa Reddy Sensational Comments - Sakshi

సాక్షి, ఖమ్మం జిల్లా: పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనిషిని మనిషిగా చూడండంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘మీరు అధికార మదంతో రెచ్చిపోయినా.. ప్రజల తీర్పు ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. నేను ప్రజల తరఫున గొంతు ఎత్తుతూనే ఉంటా. పినపాకలో నీకు పనేంటని కొందరు అంటున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చా’’ అని  పొంగులేటి అన్నారు.

‘‘నాకు రాజకీయ గాడ్‌ ఫాదర్‌ లేరు. తెలంగాణ ప్రజలే నాకు గాడ్‌ ఫాదర్‌. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతా. నేను సంక్రాంతికి వచ్చిన గంగిరెద్దుల వాడిని కాదు. కేటీఆర్‌తో ఉన్న చనువుతో ఇన్ని రోజులు పార్టీలో కొనసాగా. నేను అడిగితే మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు. సెక్యూరిటీ తగ్గించినా నేను అడగను. ఉన్న ఇద్దరు గన్‌మెన్లను సైతం వెనక్కి తీసుకోండి’’ అని పొంగులేటి అన్నారు. కాగా,  పినపాక ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలు కనిపించలేదు.
చదవండి: సీఎస్‌ సోమేష్‌కుమార్‌ క్యాడర్‌ కేటాయింపు రద్దు.. టీఎస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement