
చంద్రబాబు కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీకి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు.. కాని ఇలాంటి ఆరోపణలు సమంజసం కాదంటూ మంత్రి హితవు పలికారు.
సాక్షి, విజయవాడ: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ అంటూ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
చంద్రబాబు కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీకి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు.. కాని ఇలాంటి ఆరోపణలు సమంజసం కాదంటూ మంత్రి హితవు పలికారు. సీఎం జగన్ పార్టీ పెట్టకపోతే ఎమ్మెల్యేలు అయ్యేవారా?. ఇలాంటి వారికి సీఎం జగన్ భయపడేవారు కాదు. టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే. ఇలాంటి వాళ్లు వెళ్లినా వచ్చే నష్టమేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
చదవండి: కోటంరెడ్డి ఆరోపణలు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్