కేసీఆర్‌పై నిఘా పెంచాలి: నాగం  | Nagam Janardhan Reddy Comments Over KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై నిఘా పెంచాలి: నాగం 

Aug 23 2023 1:47 AM | Updated on Aug 24 2023 6:48 PM

Nagam Janardhan Reddy comments over kcr - Sakshi

కందనూలు: సీఎం కేసీఆర్‌పై నిఘా పె ట్టాలని, ఆయన విదేశాలకు పారిపోకుండా పాస్‌పోర్టును సీజ్‌ చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వారికే టికెట్లు కేటాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వం రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ మాఫియాను పెంచి పోషించిందని ఆరోపించారు. పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని దొంగలపాలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో మార్కండేయ ప్రాజెక్టు పూర్తి చేస్తానని, లేకపోతే తనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తానన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తనకు మద్దతుగా ప్రచారం చేస్తే కారులో డీజిల్‌ పోయించి.. ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తానని మర్రికి సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement