ఓడిపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. సవాల్‌కు సిద్ధమా?: పలమనేరు ఎమ్మెల్యే

MP Mithun Reddy Gives Clarity On TDP Fake Propaganda At Kuppam - Sakshi

సాక్షి, చిత్తూరు: కుప్పంలో అధికార పార్టీ అభ్యర్థులకు మంచి ప్రజాదరణ లభిస్తుంటే టీడీపీ కనీస ఆదరణకు నోచుకోలేకపోతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం ప్రచారంలో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. కుప్పం మున్సిపాల్టీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. కుప్పంలో ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. ఓటమి భయంతనే టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. టీడీపీ అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. 

కుప్పంలో 30 సంవత్సరాలుగా ఎవరు రౌడీయిజం చేస్తున్నారో అందరికీ తెలుసు. మున్సిపల్‌ కమిషనర్‌ మీద దాడి చేసిన ఘనత టీడీపీది. ఇప్పుడు చంద్రబాబు కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నాడు. కుప్పంలో ప్రశాంత వాతావరణం ఉంది. స్వేచ్ఛగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రజల తీర్పును గౌరవిస్తాం. ఎన్నికల ఫలితాలు వచ్చే 15వ తేదీ వరకు వేచి ఉండండి. ఇప్పటి నుంచే అనవసరమైన గొడవలు చేయకండి. కుప్పం ప్రజల తీర్పు వైఎస్సార్‌సీపీకే ఉంటుంది అని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. 

దమ్ముంటే సవాల్‌ స్వీకరించు: పలమనేరు ఎమ్మెల్యే 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. టీడీపీ ఓడిపోతే కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద క్షమాపణ చెప్తావా అంటూ టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. దమ్ముంటే సవాల్ స్వీకరించు. ఈ రోజు సాయంత్రం వరకు ఎదురు చూస్తూ ఉంటా. సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డిలు మాకు శాంతియుతంగా ప్రచారం చేయమని చెప్పారు. టీడీపీ మాత్రం అరాచకాలకు పాల్పడుతోంది. ప్రజలే గుణపాఠం చెబుతారు అని ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. 

చదవండి: (‘చంద్రబాబు అంటేనే గూండాగిరి రాజకీయాలకు పెట్టింది పేరు’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top