రాహుల్‌ గాంధీ యాత్ర: లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ | Mallikarjun Kharge Launches Bharat Jodo Nyay Yatra Logo Tagline | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ యాత్ర: లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ

Published Sat, Jan 6 2024 2:55 PM | Last Updated on Sat, Jan 6 2024 3:10 PM

Mallikarjun Kharge Launches Bharat Jodo Nyay Yatra Logo Tagline - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తరహాలో మారో యాత్ర చేపడతారని కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసందే. అయితే శనివారం రాహుల్‌ గాంధీ చేపట్టే యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేస్తూ కాంగ్రెస్‌ చీఫ్‌ మళ్లికార్జున ఖర్గే ప్రకటించారు.

భారత్ జోడో యాత్ర లోగో, స్లోగన్‌ను ఖర్గే ఆవిష్కరించారు. ఈ యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా  నామకరణం చేసి.. ‘న్యాయం అందేవరకు’ అనే స్లోగన్‌ను పెట్టినట్లు తెలిపారు. ఇక.. ఈ జనవరి 14 నుంచి రాహుల్‌ గాంధీ చేపట్టే.. ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మణిపూర్‌లోని ఇంఫాల్‌ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు బస్సు యాత్రగా కొనసాగనుంది.

చదవండి:  Ayodhya: 22న అయోధ్యలో హైసెక్యూరిటీ.. భద్రతా బలగాలివే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement