హైడ్రా బాధితురాలు బుచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం: కేటీఆర్‌ | KTR Visits HYDRAA victim Buchhamma Family Kukatpally | Sakshi
Sakshi News home page

హైడ్రా బాధితురాలు బుచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం: కేటీఆర్‌

Oct 28 2024 4:51 PM | Updated on Oct 28 2024 6:49 PM

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోి హైడ్రా కూల్చివేతల బాధితులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం పరామర్శించారు. నగరంలోని హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. గతంలోనే బుచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించామని, ఇచ్చిన మాట ప్రకారం అండగా ఉంటామని తెలిపారు. బుచ్చమ్మ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు

‘సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుముల నివాసం కూడా ఎఫ్‌టీఆఎల్‌ పరిధిలో ఉంది. ఆయనకు హైడ్రా నోటీసులు ఇస్తే.. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. పేదలకు మాత్రం ఎలాంటి నోటీసులు, కోర్టు స్టేలు ఉండవు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు. హత్య. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం, హైడ్రా అరాచకం పేరుతో జరిగిన హత్య.  ప్రభుత్వం కనీసం సానుభూతి ప్రకటించలేదు.

దిక్కుమాలిన ప్రభుత్వం వల్ల పేదలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. బుచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం. వాళ్ల కూతురికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఆమెకు పార్టీ తరపున మేము ఆపరేషన్‌ చేపిస్తాం, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తలసాని నేడు కొంత ఆర్థిక సాయం చేశారు.’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement