బండి సంజయ్‌పై కేటీఆర్‌ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా | KTR files Rs 100 crore defamation suit against Bandi Sanjay | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌పై కేటీఆర్‌ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా

Sep 15 2025 5:17 PM | Updated on Sep 15 2025 6:27 PM

KTR files Rs 100 crore defamation suit against Bandi Sanjay

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ అంశానికి తనపై ఆరోపణల చేసిన బండి సంజయ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. తనపై చేసిన ఆరోపణలకు గాను బండి సంజయ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్‌ కోర్టులో రూ. 100 కోట్ల దావా పిటిషన్‌ దాఖలు చేశారు కేటీఆర్‌. 

కాగా, ఫోన్‌ట్యాపింగ్‌ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గత నెలలోనే లీగల్‌ నోటీసులు పంపారు. బండి సంజయ్‌ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా కేటీఆర్‌ మంగళవారం పంపిన నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన పత్రికా సమావేశంలో బండి సంజయ్‌ తన హోదాను దుర్వినియోగం చేస్తూ కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు ఈ తరహా ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు.

మీడియా సమావేశంలో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటూ ప్రజాజీవితంలో ఉన్న మరో శాసనసభ్యుడిపై అసత్యాలతో కూడిన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. బండి సంజయ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోటీసు అందిన వారంలోపు బండి సంజయ్‌ స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అయితే తాజాగా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా పిటిషన్‌ను దాఖలు చేశారు కేటీఆర్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement