
సీఎం బావమరిది కంపెనీకి అనుచిత లబ్ధి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అర్హత లేకున్నా.. రూ వేల కోట్ల పనులు
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల మేరకు రేవంత్ అనర్హుడు
బీజేపీ స్పందించకుంటే కుమ్మక్కు అయినట్టు భావిస్తాం
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సకుటుంబ అవినీతి కథా చిత్రం నడుస్తోంది
దీన్ని ధారావాహికంగా బయటపెడతాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథాచిత్రం నడుస్తోందని..అనేక కుంభకోణాలకు ఆయన కుటుంబసభ్యులే కేంద్రంగా ఉంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం ‘అమృత్’పథకం కింద రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.8,888 కోట్ల పనుల్లో చోటుచేసుకున్న అవినీతే దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్‌రెడ్డికి చెందిన శోధ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అర్హత, నైపుణ్యం, అనుభవం, ఆర్థిక వనరులు లేకున్నా టెండర్లు కట్టబెట్టారన్నారు.
ఈ అంశంపై సీఎం స్పందించాలని, అమృత్‌లో అవినీతి చోటుచేసుకుంటున్నా, బీజేపీ నాయకులు స్పందించని పక్షంలో కుమ్మక్కు అయినట్టు భావించాల్సి ఉంటుందన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, గోపీనాథ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి తెలంగాణభవన్‌లో శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...
మూడు నెలల్లోనే భారీ అవినీతి
‘అధికారంలోకి వచి్చన మూడునెలల్లోనే రూ.8,888 కోట్ల భారీ అవినీతికి రేవంత్ తెర లేపారు. సీఎం పదవితోపాటు పురపాలకశాఖ బాధ్యతలు చూస్తు న్న రేవంత్ తన పదవిని దురి్వనియోగం చేశారు. ఇది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11, 13 కింద సీఎంను ప్రాసిక్యూట్ చేయొచ్చు. గతంలో పదవీ దుర్వినియోగం ఆరోపణలపై ఎంపీగా సోని యాగాం«దీ, కర్ణాటకలో యెడియూరప్ప, మహా రాష్ట్రలో అశోక్‌చవాన్ ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేశారు.
ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని బెదిరించి రూ.2 కోట్ల లాభంలో ఉన్న రేవంత్ బావమరిది కంపెనీకి జాయింట్ వెంచర్ పేరిట టెండర్లు కట్టబెట్టారు. రూ.1,137 కోట్ల కాంట్రాక్టు పనుల్లో ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ వాటా కేవలం 20 శాతం మాత్రమే. శిఖండి సంస్థను అడ్డుపెట్టుకొని సీఎం బావమరిది సృజన్‌రెడ్డి ప్రజాధనం కొల్లగొడుతున్నారు. సీఎం స్వయంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టులు కట్టబెట్టారు.
టెండర్లపై పూర్తిగా గోప్యత
ఇండియన్ హ్యూమన్ పైప్ కంపెనీకి టెండర్లు దక్కిన అంశానికి సంబంధించిన జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టలేదు. ఈ టెండర్లలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు లేఖ రాశాం. కేంద్ర నిధులు పక్కదారి పడుతున్నా బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు. అమృత్‌లో అవినీతిపై విచారణకు ఆదేశించని పక్షంలో ఈ అవినీతిలో బీజేపీ నేతలు సంబంధం ఉందని భావించాల్సి వస్తుంది. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు సీఎం రేవంత్ సుద్దపూస అని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి చేస్తున్న అవి నీతిని ధారావాహికంగా బయట పెడతామని’ కేటీఆర్ అన్నారు.