ప్రభుత్వ విప్‌ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రాజీనామా | Jana Sena MLA Arava Sreedhar Resigns As Assembly Whip | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విప్‌ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రాజీనామా

May 23 2026 3:34 PM | Updated on May 23 2026 3:46 PM

Jana Sena MLA Arava Sreedhar Resigns As Assembly Whip

సాక్షి, తిరుపతి: ప్రభుత్వ విప్‌ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు వేస్ట్‌ అంటూ అరవ శ్రీధర్‌ మాట్లాడిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 24 గంటల గడవక ముందే విప్‌ పదవికి అరవ శ్రీధర్‌ రాజీనామా చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫ్యామిలీ పంచాయితీలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కళంకిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కి విప్ పదవి తొలగింపుతో సరిపెట్టారు.

బాధిత మహిళ ఆరోపణలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఫ్యామిలీ పంచాయితీకి 4 వారాల గడువు ఇచ్చిన పవన్‌.. చట్టపరమైన చర్యలు లేకుండా సెటిల్‌ చేసుకోవాలని బాలరాజును ఆదేశించారు. కుటుంబ సభ్యుల నుంచే బాలరాజు వ్యవహార శైలిపై ఆరోపణలు ఉన్నాయి. పవన్‌ ఫ్యామిలీ సెటిల్‌మెంట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు విడుదల చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది. ఇప్పటికే అరవ శ్రీధర్‌కు సంబంధించి పలు వీడియోలు విడుదల చేసిన బాధితురాలు.. తాజాగా మరో కీలక వీడియోను బహిర్గతం చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అరవ శ్రీధర్‌ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది. ఆ వీడియోలో ‘చంద్రబాబు వేస్ట్‌’ అంటూ అరవ శ్రీధర్‌ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వ విప్‌ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రాజీనామా సంచలనంగా మారింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement