‘మంత్రి ఈటలను సీఎంను చేయండి’

Inti Party Cheruku Sudhakar Demands Etela Rajender Become CM  - Sakshi

ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌ సంచలన వ్యాఖ్యలు

మహబూబాబాద్‌: తెలంగాణ ఏర్పడితే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ రాష్ట్రం ప్రకటించారని, అయితే దళితుడి బదులు సీఎం పదవిని కేసీఆర్‌ చేజిక్కించుకున్నారని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్‌ మండిపడ్డారు. దీనికి పోను ఇటీవల కేటీఆర్‌కు పట్టం కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆయనకు బదులు మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించిన సుధాకర్‌.. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
(చదవండి: కలకలం రేపుతున్న ఈటల తూటాలు)

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కాగానే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్‌ చెప్పారని, ఇప్పుడు 1,35,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నా.. లెక్కల్లో స్పష్టతలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంకు ఎన్‌డీఏ నేతలు ఎందుకు మద్దతిస్తున్నారో అర్థం కావడంలేదని, కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న తనను పరిగణలోకి తీసుకుని గెలిపించాలని సుధాకర్‌ కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top