గుంటూరు వెస్ట్‌లో టీడీపీకి భారీ షాక్‌ | Sakshi
Sakshi News home page

గుంటూరు వెస్ట్‌లో టీడీపీకి భారీ షాక్‌..వైస్‌ఆర్‌సీపీలోకి కీలక నేతలు

Published Fri, Apr 19 2024 3:05 PM

Huge Joinings In Ysrcp From Guntur West Tdp  - Sakshi

కాకినాడ,సాక్షి: ఎన్నికల వేళ గుంటూరు ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి గట్టి షాక్ త‌గిలింది. టీడీపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు శుక్ర‌వారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆధ్వ‌ర్యంలో  సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 

సీఎం వైఎస్జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వారందరినీ ఆప్యాయంగా ప‌లుక‌రించి, కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్‌.టి.రాజపురం మేమంతా సిద్ధం బస్సు యాత్ర నైట్‌ స్టే పాయింట్ వద్ద చేరికల కార్యక్రమం జరిగింది.

టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో మాజీ కార్పొరేట‌ర్ ఎస్‌.కెసైదా, మొండి బండ సంఘం జిల్లా అధ్య‌క్షుడు పి.కృష్ణ‌, టీడీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేక‌ల మాధ‌వ‌యాద‌వ్ తదితరులున్నారు. 

ఇదీ చదవండి.. మేమంతా సిద్ధం.. 18వ రోజు సీఎంజగన్‌కు ఘన స్వాగతం

Advertisement
 
Advertisement