
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరో, తమిళగ వెట్రీ కజగం (TVK) అధినేత విజయ్ తమిళనాడు కరూర్ జిల్లాలో హీరో,టీవీకే అధినేత విజయ్ (Vijay) ప్రచార ర్యాలీలో తొక్కిసలాట (Karur stampede) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ ఆరోపణల ఉచ్చు బిగిస్తున్నట్లు తాజా ఎఫ్ఐఆర్ వివరాలు సూచిస్తున్నాయి.
పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం, సెప్టెంబర్ 27, 2025న వేలుసామిపురం వద్ద ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ‘మీట్ ద పీపుల్’ ర్యాలీకి 11 గంటలకల్లా భారీగా అభిమానులు, టీవీకే కార్యకర్తలు చేరుకున్నారు. మధ్యాహ్నం ప్రసంగించాల్సిన విజయ్ నాలుగు గంటల ఆలస్యంగా, సాయంత్రం 7 గంటలకు సభకు హాజరయ్యారు. ఈ ఆలస్యమే సభపై అంచనాలను పెంచి, జనసందోహాన్ని అధికంగా పెంచిందని పోలీసులు పేర్కొన్నారు.
అనుమతి ఉల్లంఘన.. నిర్వాహకుల నిర్లక్ష్యం
విజయ్ ప్రసంగించాల్సిన బస్సు అనుమతి పొందిన స్థలంలో ఆగకపోవడం.. నీరు, ఆహారం అందించడంలో నిర్లక్ష్యం, ట్రాఫిక్‌కు అంతరాయం వంటి అంశాలు ఎఫ్‌ఐఆర్‌లో హైలెట్ అయ్యాయి. పోలీసుల విజ్ఞప్తిని పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్ బస్సీ ఆనంద్ సహా టీవీకే నేతలు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.
బారీకేడ్లు తొలగింపు.. పైకప్పు కూలి విషాదం
జనసమూహాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన పోలీసు బారీకేడ్లను టీవీకే వాలంటీర్లు తొలగించడంతో, పరిస్థితి అదుపు తప్పింది. అభిమానులు విజయ్‌ను చూడాలనే ఉత్సాహంతో రూఫ్‌పైకి ఎక్కగా, పైకప్పు కూలిపోయి టీవీకే వాలంటీర్లు మరణించినట్లు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో హైలెట్ చేశారు.
This will haunt you forever! @TVKVijayHQ #tvkstampede #KarurTragedy #KarurStampede pic.twitter.com/jKTbSyfIhS
— Karunyan MBA (@KarunyanMBA) September 28, 2025
తమిళనాడులో కనీవిని ఎరుగని ఘోరం చేటు చేసుకుంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్‌లో నిర్వ హించిన ‘మీట్ ది పీపుల్’ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 18 మహిళలు, 13 పురుషులు, 5 బాలికలు, 5 బాలురు ఉన్నారు. 60 మందికి పైగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది
ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పలు క్రిమినల్ సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. టీవీకే పార్టీ నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం జరిగిందనే ఆరోపణలతో టీవీకే నేతలు ఎన్ ఆనంద్ కుమార్, సీటీఆర్ నిర్మల్‌కుమార్, మతియళగన్‌పై అరెస్టు చర్యలు ప్రారంభించారు
తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో టీవీకే పిటిషన్ దాఖలు చేసింది . సీబీఐ,సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. తమిళనాడు ప్రభుత్వం అరుణ జగదీశన్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. విజయ్ దుర్ఘటనపై స్పందిస్తూ..కరూర్ తొక్కిసలాటలో మరణించిన ప్రతీ కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.