పూర్తైన వరంగల్‌, ఖమ్మం మేయర్ల ఎన్నిక

Finalised Mayor Candidate Khammam And Warangal - Sakshi

క‌మ్మ సామాజిక వ‌ర్గానికే ఖ‌మ్మం మేయ‌ర్ ప‌ద‌వి

మైనార్టీల‌కు డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వి

పార్టీ విధేయుల‌కే ప‌ట్టం క‌ట్టిన అధిష్టానం

సాక్షి, ఖమ్మం: గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్త‌య్యింది. అనుకున్నట్లుగానే కమ్మ సామాజిక వర్గానికే ఖమ్మం మేయర్ పదవి ద‌క్కింది. 26వ డివిజ‌న్ నుంచి గెలిచిన పునుకొల్లు నీర‌జ ఖమ్మం మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీ వర్గానికి ద‌క్క‌గా.. ఖమ్మం 38వ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలిచిన ఫాతిమా పేరును అధిష్టానం ఖరారు చేసింది.

వరంగల్ మహా నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక
వరంగల్ మేయర్ పీఠానికి 29 వ డివిజన్ కార్పొరేటర్ గుండు సుధారాణి పేరును అధిష్టానం ఖరారు చేసింది. సుధారాణికి మేయర్ పీఠం ఖాయమన్న ప్రచారం ముందు నుంచి జరిగింది.. అధిష్టానం కూడా ఆమె పేరే ప్రకటించింది. డిప్యూటీ మేయర్ ప‌ద‌వికి రిజ్వాన షమీకి ద‌క్కింది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా తెరాస ఎన్నికల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించారు.

మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేయ‌ర్‌, చైర్‌ప‌ర్స‌న్ల కోసం ప‌రోక్ష ఎన్నిక నిర్వ‌హించారు. మేయర్ అభ్యర్థుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్లను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం, పార్టీ పరిశీలకులకు అందించింది. వరంగల్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగుల కమలాకర్, పరిశీలకులుగా వ్యవహరించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యారు. వీరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తిచేయడం జరిగింది.

చ‌ద‌వండి: Municipal Polls: ఆ ఊపు లేదు.. హవా లేదు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top