కాంగ్రెస్‌లోకి ప్రముఖ న్యాయవాది దామోదర్‌రెడ్డి  | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి ప్రముఖ న్యాయవాది దామోదర్‌రెడ్డి 

Published Sun, Nov 5 2023 4:23 AM

Damodar Reddy Joing Congress In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు సీనియర్‌ న్యాయవాది దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్‌ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ దామోదర్‌రెడ్డి సేవలను వినియోగించుకుంటామని, పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కొడంగల్, చేవెళ్ల, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

Advertisement
 
Advertisement