కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు.. తప్పుగా అనుకోవద్దని వ్యాఖ్యలు

Congress MLA Jagga Reddy Praises CM KCR Sangareddy Medical College - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజ కవర్గానికి మెడికల్‌ కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌ను పొగడక తప్పదని, దాన్ని తప్పుగా అనుకోవద్దని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణ పనులను బుధవారం జగ్గారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

‘సంగారెడ్డికి నేను ఎమ్మెల్యేను. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను. అలా అని నేను ఎందుకు చెబుతున్నానంటే.. ఎమ్మెల్యేకు కొంత బాధ్యత ఉంటుంది. పార్టీ అంటే పోరాటం. ఎమ్మెల్యే అంటే ఆరాటం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటే ఓ రకంగా ఉంటుంది. ప్రభుత్వం లేకుంటే రిక్వెస్ట్‌ చేసి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే బాధ్యతాయుత పదవి కావడంతో స్థానిక ప్రజల డిమాండ్‌ను నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇందుకోసం సంగారెడ్డి మెడికల్‌ కాలేజీ ఆవశ్యకతను అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించా. కాలేజీ పనులను వెంటనే పూర్తి చేసి సీఎం చేతుల మీద ప్రారంభించాలని  మంత్రి హరీశ్‌ను కోరాను’అని చెప్పారు.   
చదవండి👇
పంజగుట్ట: మేనేజర్‌ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని..
ప్రగతిభవన్‌కు తిమ్మక్క.. సమీక్ష సమావేశానికి తీసుకెళ్లి సత్కరించిన సీఎం కేసీఆర్‌
సమయం లేదు గణేశా!.. జీహెచ్‌ఎంసీ యాక్షన్‌ ప్లాన్‌ ఏమిటో?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top