రేట్ పెంచుతున్నాం.. కులాల మధ్య చిచ్చుపెట్టండి.. | Chandra Babu Give Offer To TDP Social Media For Provoke On YSRCP | Sakshi
Sakshi News home page

రేట్ పెంచుతున్నాం.. కులాల మధ్య చిచ్చుపెట్టండి..

Dec 17 2023 10:22 AM | Updated on Dec 17 2023 10:30 AM

Chandra Babu Give Offer To TDP Social Media For Provoke On YSRCP - Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడ్తున్న టీడీపీ సోషల్ మీడియా విభాగానికి (ఐటీడీపీ)కి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకు ముందు ఒక్కో ఒక్కో సోషల్ మీడియా పోస్టుకు ఇచ్చే దానికన్నా ఎక్కువ రేటు ఇస్తామని.. పోస్టుకు రూ.వంద ఇస్తామని ఇక ముందు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌.. ఫెస్‌బుక్‌లో పోస్టులను పెంచాలని. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా పని చేయాలని రెచ్చగొట్టినట్లు తెలిసింది. వెనకా ముందూ చూడొద్దని, ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పని చేయాలనీ ఆదేశించినట్లు తెలిసింది. రెడ్లందరూ రౌడీలుగాను.. సీమ ప్రజలు.. సీమ నాయకులంతా గూండాలు అన్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. 

ఆంధ్రాలో అరాచకానికి, హింసను రేపేందుకు సీమ నుంచి ముఠాలు దిగాయని ప్రచారం చేయాలని ఆయన సూచించారని, ఈ విషయంలో ఉత్సాహంగా ప్రచారం చేయాలనీ, తమకు ఎన్నికలకు కేవలం వందరోజులు టైం మాత్రమే ఉన్నందున అత్యంత వేగంగా ఈ దుష్ప్రచారం చేయాలనీ ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అటు తమకు అనుకూలమైన మీడియా, ఛానెళ్లలో ఎలాగూ సొంత కథనాలు ఇస్తున్నామని, అయితే వాటికి విశ్వసనీయత తగ్గిన నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి ఇలా ప్రచారం చేయాలనీ ఆయన వారిని ఉత్సాహపరిచినట్లు తెలిసింది.

రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాని వెనుక వైఎస్సార్‌సీపీయే ఉందంటూ మరింత రచ్చ చేయాలని దిశానిర్దేశం చేసారని, సోషల్‌ మీడియాలో పెట్టే ప్రతి నెగెటివ్‌ పోస్టుకూ ఒక రేటు ఉంటుందని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు చెప్పినమేరకు ఐటీడీపీ కార్యకర్తలు వెనుకాముందూ చూడకుండా ఏమాత్రం ఆధారాలు లేకున్నా సరే సొంతంగా అవాస్తవాలను సృష్టించి స్టోరీలు రాస్తున్నట్లు తెలుస్తోంది. కులాలమధ్య, చిచ్చుపెట్టేందుకు సైతం సోషల్ మీడియాను సమర్థంగా వాడుకోవాలని బాబు సూచించినట్లు తెలుస్తోంది.

   - ✒️✒️సిమ్మాదిరప్పన్న               

చదవండి: లోకేష్ ముగింపు సభకు పవన్ డుమ్మా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement