
చంద్రబాబు, పవన్‌కు భేదాభిప్రాయాలు వచ్చాయా?. యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ ఎందుకు డుమ్మా కొడుతున్నట్టు?. పొత్తుల తక్కెడలో పవన్ అడిగిన అన్ని సీట్లు చంద్రబాబు ఇవ్వడం లేదా?. 50 ఎమ్మెల్యే టికెట్లు 5 ఎంపీ టికెట్లు ఇవ్వడానికి చంద్రబాబు ససేమిరా అంటున్నాడా?. జైలు ముందు చేసిన పొత్తు ప్రకటన ఎన్నికల దాకా ఉంటుందా?. యువగళం ముగింపు సభకు గైర్హాజర్ కావాలన్నా పవన్ నిర్ణయం దేనికి సంకేతం?. టీడీపీ, జనసేనలో అసలు ఏం జరుగుతోంది?
ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్‌కు.. పవన్ కల్యాణ్ గట్టి షాక్ ఇచ్చినట్లు అయింది. యువగళం ముగింపు సందర్భంగా బహిరంగ సభకు రావాలని పవన్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేయగా, తనకు వేరే షెడ్యూల్ ఉందని రాలేనంటూ పవన్ హ్యాండ్ ఇచ్చారు.
టీడీపీ, జనసేన మధ్య సీట్లు సర్దుబాటుపై స్పష్టత రాకపోవడంతోనే పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఉన్నట్లు జనసేనలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ-జనసేన కూటమికి లోకేష్‌ను నాయకుడిగా పవన్ కళ్యాణ్ గుర్తించడం లేదని, కూటమి అధికారంలోకి వస్తే తానే నాయకుడని పవన్ కళ్యాణ్ చెప్పాలనుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: చినబాబు చీప్ ట్రిక్స్