అయిననూ పోయి రావలె.. నో ప్రాజెక్ట్, నో ఫండింగ్.. రేవంత్‌పై కేటీఆర్‌ సెటైర్లు | BRS KTR Satirical Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

అయిననూ పోయి రావలె.. నో ప్రాజెక్ట్, నో ఫండింగ్.. రేవంత్‌పై కేటీఆర్‌ సెటైర్లు

Aug 2 2025 10:45 AM | Updated on Aug 2 2025 11:30 AM

BRS KTR Satirical Comments On CM Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఢిల్లీకి 50 సార్లు చక్కర్లు కొట్టినా.. ఫలితం మాత్రం సున్నా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి.. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! అంటూ సెటైర్లు వేశారు. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశ్యం కాంగ్రెస్‌కు, సీఎంకు లేదన్నారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..

  • 50 TRIPS – ZERO RESULTS !

  • హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్!

  • తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..

  • ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.

  • కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్  చేసిన మూడు పనులు:

  • మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం!

  • రెండో పని – ఢిల్లీకి పోవడం!

  • మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం!

  • రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు..

  • రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు...

  • సాగునీళ్లు రావు ..  తాగునీళ్లు లేవు ..

  • కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదు

  • బనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదు

  • రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదు

  • రుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదు

  • తులం బంగారం ఊసు లేదు ..  రూ.4 వేల ఫించన్ జాడ లేదు

  • గురుకులాల గోడు పట్టదు - గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదు

  • కానీ రేవంత్ రెడ్డి  3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు

  • “ఒక్కసారి కాదు… రెండు సార్లు కాదు…50 సార్లకు చేరిన హస్తిన యాత్ర

  • కానీ తెచ్చింది ఏమీ లేదు!
    శుష్కప్రియాలు .. శూన్య హస్తాలు 
    అయిననూ పోయి రావలె హస్తినకు!

  • కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి?? 
    నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ…
    దానికి బదులు దక్కింది మాత్రం...

  • 👉 ఫోటో షూట్లు, వీడియోలు 
    👉 విందు రాజకీయాలు!

  • రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి.. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement