
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందన్న కేటీఆర్.. ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమయ్యిందన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి.. నీళ్లు చంద్రబాబుకి.. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయిస్తున్నారు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడానికేనా?. నువ్వు గద్దెనెక్కింది’’ అంటూ ఎక్స్ వేదికగా రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కోవర్టులెవరో, తెలంగాణ కోసం కొట్లాడిందెవరో తేలిపోయింది. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా పోరాటం తప్పదు. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడతాం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా?. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు?. నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో!’’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.
ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది!
48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యింది
నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి!
బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి….
గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం…— KTR (@KTRBRS) July 16, 2025