ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్లకు ధారాదత్తం

Brinda Karat Comments On BJP - Sakshi

మోదీపై బృందాకారత్‌ ధ్వజం

తిరుపతి కల్చరల్‌: నవరత్నాల్లాంటి ప్రభుత్వ సంస్థలను అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ విమర్శించారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ నుంచి ఈ దేశాన్ని కాపాడుకుందాం అంటూ జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా తిరుపతి రామతులసీ కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం సభ నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించారు. 6,300 కోట్లకుపైగా లాభం వస్తున్న విశాఖ ఉక్కును అమ్మడంలో మర్మమేంటన్నారు. పోలవరం నిర్వాసితులకు ఒక్కపైసా నష్టపరిహారం, పునరావాసం కల్పించలేదన్నారు. త్వరలోనే తిరుపతి విమానాశ్రయాన్ని ఆదాని చేతుల్లో పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top