‘రఘురామకృష్ణంరాజు.. ఆ పనులు చూసుకోండి’ | Sakshi
Sakshi News home page

బీజేపీతో టీడీపీ ప్రమాదకర ఆట

Published Fri, Aug 21 2020 6:57 PM

BJP Leader Vishnu Vardhan Reddy Fires On TDP Leader - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడు తీరుపై  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతల గురించి మాట్లాడే తీరును మార్చుకోవాలని హితవు కలిపారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి పొగుడుతూ మరోవైపు ఎమ్మెల్యేల చేత తిట్టించడం నీచ రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా పత్రికలు, టీవీలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేశారని మండిపడ్డారు. ఇప్పుడేమో ప్రజల్లోకి రాకుండా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంగా టీడీపీ విఫలమైంది. టీడీపీ నేతలు ప్రధాని మోదీని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజును, ఎంపీ జీవీఎల్‌‌ను కుల రాజకీయాలకు లక్ష్యంగా చేసుకున్నారా?. చంద్రబాబు విష ప్రచారం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీని ప్రజలు మర్చిపోయారు. గతంలో పేపర్ పులిగా నిలిచిపోయారు. ఇప్పుడు జూమ్, ట్విటర్లకే పరిమితం అయ్యారు. ఎన్టీ రామారావు ప్రారంభించిన పార్టీ.. ఇప్పుడు కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది. సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీడీపీ ఎందుకు భయపడిపోతుందో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది. (‘లోకేష్‌ మీద వలంటీర్‌ను పోటికి పెట్టి గెలిపిస్తాం’)

ఆ పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అగ్రకుల దుహంకారం బయటపెట్టుకున్నారు. టీడీపీ ఆఫీసు నుంచి అనధికార వెబ్‌సైట్స్‌, సామాజిక మాధ్యమాల పేరుతో విష ప్రచారం ఎందుకు? ధైర్యం ఉంటే మీ అధికారిక వెబ్‌సైట్‌లో అధికారిక ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేయండి?. బీజేపీ మీద చంద్రబాబు, లోకేష్ సామాజిక మాధ్యమాల్లో లక్షల ఖర్చు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి సలహాలు ఇచ్చే స్థాయి రఘురామకృష్ణంరాజుకు లేదు. మీకు వేరే వాళ్ళు చాలా పనులు అప్పజెప్పారు. ఆ పనుల్లో బిజీగా ఉండండి. రాష్ట్రంలో ఏం చేయాలో మేము చూసుకుంటాం. గతంలో మా కండువా కూడా కప్పుకున్నారు. బీజేపీతో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆడుతున్నది ప్రమాదకర ఆట అనే విషయాన్ని  గుర్తు పెట్టుకోండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement