ఇన్ని రోజులు నిద్రపోయారా.. కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ ఫైర్‌ | Bandi Sanjay Serious Comments On Congress Party | Sakshi
Sakshi News home page

ఇన్ని రోజులు నిద్రపోయారా.. కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

Jan 7 2023 1:16 PM | Updated on Jan 7 2023 1:16 PM

Bandi Sanjay Serious Comments On Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయంలో వేడెక్కింది. ఇటీవల చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది నేతలపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బండి సంజయ్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైంది. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉందని వాళ్ల నేతలే చెబుతున్నారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉంది. ఎమ్మెల్యేలు ఎటుపోయారో ఇన్ని రోజులు అధ్యక్షుడికి తెలియదా?. బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం’ అని అన్నారు. 

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement