ఎన్నికల తర్వాత బాబు కనుమరుగే: మంత్రి చెల్లుబోయిన | Ap Minister Chelluboina Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఎన్నికల తర్వాత బాబు కనుమరుగే: మంత్రి చెల్లుబోయిన

Feb 5 2024 5:34 PM | Updated on Feb 5 2024 5:41 PM

Ap Minister Chelluboina Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: మేనిఫెస్టోలో చెప్పిందే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ అన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవాడికి మంచి చేసిన సీఎం జగన్‌ను ఓడిస్తానంటున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత కనుమరుగవుతాడని హెచ్చరించారు.

చంద్రబాబును నమ్మితే మోసపోయినట్లేనన్నారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందన్నారు. పేదవాడు భద్రతతో బతుకుతున్నాడని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు ఇదే కోరుకున్నారన్నారు. అయినా దుష్టచతుష్టయం ధనదాహంతో సీఎం జగన్‌ పాలనపై అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు చెల్లుబోయిన.

ఇదీచదవండి.. నారా లోకేష్‌ను దాచేసినట్లున్నారు

Advertisement
 
Advertisement
Advertisement