చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫైర్‌

Adimilapu Suresh Challenge To TDP Win In Yerragondapalem - Sakshi

సాక్షి, ప్రకాశం: చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫైర్‌ అయ్యారు. బాబు సభకు జనం రాకపోవడంతనే గొడవలు సృష్టించారని ధ్వజమెత్తారు. యర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ కంచుకోట.. దమ్ముంటే టీడీపీ గెలవాలని సవాల్‌ విసిరారు. యర్రగొండపాలెంలో టీడీపీ గెలిస్తే రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తానని ఛాలెంజ్‌ చేశారు.

దళితులపై రాళ్లదాడి పాపం చంద్రబాబుదేనని మంత్రి ఆదిమూలపు విమర్శించారు. చంద్రబాబే దగ్గరుండి తమ కార్యకర్తలపై దాడి చేయించారని మండిపడ్డారు. యర్రగొండపాలెంలో అసైన్డ్ భూముల అక్రమాలు, గంజాయి ఉందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలన్నారు.
చదవండి: ప్రకాశం: చంద్రబాబుకు నిరసన సెగ

కాగా, అధికారంలో ఉన్న ఐదేళ్లూ వెలిగొండ ప్రాజెక్టును గాలికొదిలేసిన చంద్రబాబు.. వెలిగొండను తానే పూర్తి చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి దుయ్యబట్టారు. పశ్చిమ ప్రకాశం ప్రజలను మరోమారు మోసం చేసేందుకు వెలిగొండ పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బాబు మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అసలు వెలిగొండపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top