‘ఈటలపై తోడేళ్ల దాడి... తప్పించుకోవడానికే ఢిల్లీకి’  | Dasoju Sravan Demands Telangana Govt Should Come Out With Job Recruitment Calendar | Sakshi
Sakshi News home page

‘ఈటలపై తోడేళ్ల దాడి... తప్పించుకోవడానికే ఢిల్లీకి’ 

Jun 1 2021 9:37 AM | Updated on Jun 1 2021 9:57 AM

Dasoju Sravan Demands Telangana Govt Should Come Out With Job Recruitment Calendar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తోడేళ్ల దాడిని తప్పించుకోవడానికే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఢిల్లీ వెళ్లారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ తన ఆధిపత్యం నిరూపించుకోవడానికి ఈటలతోపాటు ఆయన భార్య జమున, కొడుకు, కోడలుపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 50 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగాలకు అర్హత సాధించిన స్టాఫ్‌ నర్సులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

3,311 మంది స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల్లో 2,418ని భర్తీచేసి మిగతా 893 మంది అభ్యర్థులతో టీఎస్‌పీఎస్సీ చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. దీన్ని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి పట్టించుకోవాలని కోరారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని, ఉద్యోగాలురాక 50 మంది  ఆత్మహత్య చేసుకున్నారని శ్రవణ్‌ ఆరోపించారు. 
చదవండి: ఈటల.. ఒంటరిగానే..!..పావులు కదుపుతోన్న టీఆర్‌ఎస్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement