పెద్దపల్లి: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 6వ వార్డు కౌన్సిలర్ భాకం సాయికిరణ్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) సీజన్–2 క్రికెట్ పోటీలు ప్రారంభించి మాట్లాడారు. ఏషియన్ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికి వన్నె తెచ్చిన ఆర్చరీ క్రీడాకారిణి చికితను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని వివరించారు. గెలుపోటములు సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్లు బిరుదు రాధాకృష్ణ, నూగిళ్ల మల్లయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాశ్‌రావు, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


