పెద్దపల్లిరూరల్: దేశంలో అవినీతి, కుంభకోణాలు, స్కాంల కాంగ్రెస్‌ను గద్దె దించి దేశప్రజలకు నీతివంతమైన పాలనను ప్రధాని నరేంద్రమోదీ అందిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీ పాలననే జనం కోరుకుంటున్నారన్నారు. ‘సర్’పై విపక్షాలకు కనీస అవగాహన లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఎవరికీ కట్టబెట్టినా అందరం గ్రూపు రాజకీయాలు పక్కనబెట్టి అభ్యర్థి విజయానికి పాటుపడదామన్నారు. పెద్దపల్లిలో బీజేపీ విజయం సాధించడం సులువేనని, గెలవకుంటే గుండు కొట్టించుకుంటానని శపథం చేశారు. అనంతరం ఎస్టీ మోర్చా నూతన కమిటీ ఉపాధ్యక్షుడిగా సురేశ్‌నాయక్, లింగం, విజయ, ప్రధాన కార్యదర్శులు రమేశ్, బలవంత్ అనిల్, కార్యదర్శులు ఎస్లావత్ శ్రీనివాస్, నేనావత్ అరుణ్‌కుమార్, టూర్ మానిటరింగ్ కన్వీనర్‌గా లావుడ్య రాజేశ్, మన్‌కీబాత్ కన్వీనర్ గా అజ్మీరా కిరణ్‌ను నియమించారు. ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అరుణ్‌రాంఝా, శివంగారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


