రైల్వేయాప్‌లో ఫెస్టివల్‌ రైళ్ల వివరాలు అప్‌డేట్‌ | - | Sakshi
Sakshi News home page

రైల్వేయాప్‌లో ఫెస్టివల్‌ రైళ్ల వివరాలు అప్‌డేట్‌

Oct 11 2026 12:09 AM | Updated on Oct 11 2026 12:09 AM

రామగుండం: సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌–హైద్రాబాద్‌ మధ్య దక్షిణ మధ్య రైల్వే ఫెస్టివల్‌ స్పెషల్‌, ఇటీవల జన్‌ సాధారణ రైళ్లను నడిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కొన్ని నెలలుగా ప్రత్యేకంగా నడిపించే రైళ్ల వివరాలు మాత్రమే రైల్వేయాప్‌లో అప్‌డేట్‌ చేస్తుండగా, ఫెస్టివల్‌ స్పెషల్‌, జనసాధారణ్‌ రైళ్ల వివరాలు అప్‌డేట్‌ చేయకపోవడంతో వాటి వివరాలు అందులో చూపించవు. దీంతో ప్రయాణికుల్లో అంతగా ప్రాచుర్యం సంపాదించుకోలేక సరైన ఆక్యుపెన్సీ రేషియో రాలేదు. ఈ విషయమై పలుసార్లు ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతోపాటు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణిందర్‌ ‘సాక్షిధ’ కథనాలను జోడిస్తూ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈక్రమంలో రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు నం.07711/12 తాజాగా శుక్రవారం రాత్రి రైల్వేయాప్‌లో అప్‌డేట్‌ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ప్రతీ ప్రయాణికుడు తమ డే టూర్‌ చేసే క్రమంలో తొలుత రైల్వేయాప్‌లో రైళ్ల వివరాలు గుర్తించి ప్రయాణం చేయడం సాధారణంగా మారిన విషయం తెలిసిందే.

జాతీయ ఉషు పోటీలకు కొత్తపల్లి విద్యార్థి

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థి సాయికృష్ణ స్కూల్‌ గేమ్స్‌ జాతీయస్థాయి ఉషు పోటీలకు ఎంపికయ్యాడు. గత నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 15, 16, 17తేదిల్లో జమ్ముకశ్మీర్‌లో పోటీలు జరుగనున్నాయి. సాయికృష్ణను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోతుల నారాయణ, వ్యాయామ ఉపాధ్యాయుడు బార భాను అభినందించారు.

హెచ్‌సీఏ మహిళల క్రికెట్‌ శిక్షణ ప్రారంభం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో అలుగునూరులోని వీజేఆర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ అకాడమీలో 9 రోజులపాటు నిర్వహించనున్న మహిళల రెసిడెన్షియల్‌ క్రికెట్‌ శిక్షణ శిబిరం శనివారం ప్రారంభమైంది. శిబిరాన్ని అంతర్జాతీయ క్రికెటర్‌, హెచ్‌సీఏ మహిళా క్రికెట్‌ అభివృద్ధి విభాగం అధిపతి సునీతాఆనంద్‌, హెచ్‌సీఏ సీనియర్‌ సభ్యులు రియాజ్‌ ఖురేషీ, మానసదేవి ప్రారంభించారు. శిక్షణ శిబిరాన్ని 4 జిల్లాల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా క్రికెటర్లకు నాణ్యమైన శిక్షణ అందించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, తెలంగాణలో మహిళా క్రికెట్‌కు మరిన్ని అవకాశాలు కల్పించడం ఈ శిబిరం ప్రధాన లక్ష్యాలన్నారు. హెడ్‌ కోచ్‌గా రాధాకృష్ణ, అసిస్టెంట్‌ కోచ్‌గా పీబీ సాయి లేహా, ఫీల్డింగ్‌ కోచ్‌గా అబ్దుల్‌ రహీమ్‌, ఫిజియోథెరపిస్ట్‌గా దీక్షిత వ్యవహరిస్తారని తెలిపారు. టీ20 గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆగంరావు, ఉపాధ్యక్షులు మహేందర్‌గౌడ్‌, కార్యదర్శి మనోహర్‌రావు, కార్యవర్గ సభ్యులు అజిత్‌రావు, విద్యాసాగర్‌, హరికిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా సీనియర్‌ ఖోఖో జట్ల ఎంపిక

కరీంనగర్‌స్పోర్ట్స్‌: రేకుర్తిలోని లయోలా పాఠశాలలో శనివారం కరీంనగర్‌ ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి (పెద్దపల్లి జిల్లా మినహా) సీనియర్‌ ఖోఖో జట్ల ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 50 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారు. ఖోఖో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వై మహేందర్‌ రావులు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు రాష్ట్రస్థాయిలో కరీంనగర్‌ జిల్లా జట్లు ప్రతిభ చాటి విజేతలుగా నిలవాలన్నారు. రాష్ట్ర ఖోఖో అసోసియేషన్‌ రెఫరీస్‌ బోర్డ్‌ కన్వీనర్‌ వంగపల్లి సూర్యప్రకాశ్‌, జిల్లా ఖోఖో సంఘ ఉపాధ్యక్షులు కుమారస్వామి, రవీందర్‌, సంతోష్‌, శేఖర్‌, రేణుక, రాజబాబు, రవి, కరుణాకర్‌, రాము, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement