బొడ్డెమ్మ నోము వేడుకలు | - | Sakshi
Sakshi News home page

బొడ్డెమ్మ నోము వేడుకలు

Oct 11 2026 12:09 AM | Updated on Oct 11 2026 12:09 AM

ఎలిగేడు: మండల కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో బొడ్డెమ్మ నోము వేడుకలు శని వారం ఘనంగా నిర్వహించారు. అమావాస్యకు 9రోజుల ముందు మట్టితో తయారు చేసిన బొడ్డెమ్మకు అమావాస్య రోజు వరకు తీరొక్క పూలతో ప్ర తిరోజు అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహించారు. బొడ్డెమ్మకు అమావాస్య చివరిరోజు కావడంతో బొడ్డెమ్మను నోముకుని ఎత్తుకున్న తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మను పూజించారు. అందరూ బాగుండాలని ఆమ్మవారిని వేడుకుని బొడ్డెమ్మను నిమజ్జనం చేశారు.

క్రీడలతో క్రమశిక్షణ

జ్యోతినగర్‌: క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆత్మవి శ్వాసంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని ఎన్టీపీసీ ఎస్సై వెంకటస్వామి అ న్నారు. జ్యోతినగర్‌ టీటీఎస్‌లోని జెడ్పీ హైస్కూల్‌ క్రీ డా మైదానంలో యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న దసరా క్రికెట్‌ టోర్నమెంట్‌ను శనివారం ప్రారంభించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ కాలనీల నుంచి మొత్తం 28 జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయని నిర్వాహకులు సంతోష్‌యాదవ్‌, ప్రకాశ్‌, కృష్ణ తెలిపారు. విజేతకు ట్రోఫీతో పాటు రూ.20వేల నగదు బహుమతి, రన్నరప్‌ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.10వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు.

రైతులకు సన్మానం

పాలకుర్తి: మండలంలోని ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన రైతులను శనివారం బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య–అరుణ్‌కుమార్‌ దంపతులు సన్మానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని సేవా ప్రస్థాన్‌ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలువురు రైతులను సత్కరించారు. పార్టీ నాయకులు బాలసాని మల్లేషం, బరిగెల సంతోష్‌, పిడుగు ప్రశాంత్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందన

పాలకుర్తి: మండలంలోని జీడీనగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని యూనివర్సల్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీఈటీ సంతోష్‌ తెలిపారు. ఇటీవల సుల్తానాబాద్‌లో నిర్వహించిన నెట్‌బాల్‌ సెలక్షన్స్‌ పోటీల్లో పాఠశాల విద్యార్థులు రుచిత, అంత్రచౌరస్య, అస్తాసింగ్‌ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 11, 12వ తేదీల్లో అసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్‌ ఇస్మాయిల్‌, హెచ్‌ఎం.అఫ్జల్‌ అభినందించారు.

రక్తదానం

కమాన్‌పూర్‌: మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ యువసేన ఉపాధ్యక్షులు కొత్తపల్లి సతీశ్‌, మాజీ ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్‌ ఆపదలో ఉన్న ఇద్దరికి శనివారం రక్తదానం చేశారు. మండలంలోని శాలపల్లెకు చెందిన మాటేటి మల్లమ్మ, రామగిరి మండలం చందనాపూర్‌కు చెందిన కాటారపు రవి అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే అత్యవసరంగా రక్తం కావాలని వైద్యులు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఛత్రపతి శివాజీ యువసేన సభ్యులను ఆశ్రయించగా సతీశ్‌, శ్రీనివాస్‌ ఆస్పత్రులకు వెళ్లి రక్తదానం చేశారు. సతీశ్‌ 37వ సారి రక్తదానం చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement