పెద్దపల్లిరూరల్: వీబీజీరాంజీ పథకం కింద ఉపాధి పనులు చేసిన కూలీలు అదే ప్రాంతంలో శనివారం బతుకమ్మ ఆడారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల, కనగర్తి గ్రామాల్లో ఇలా బతుకమ్మ ఆడి పాడారు.
ధర్మారం: మండలంలోని ఖిలావనపర్తి గ్రామ శివారులోని శనివారం ఉపాధి పని ప్రదేశంలో ఉపాధి కూలీలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పని ప్రదేశంలోనే తంగేడు పూలతో పాటు వివిధ రకాల పూలు సేకరించి బతుకమ్మ పేర్చి బతుకమ్మ ఆడారు. గ్రామ సర్పంచ్ మోతె కనుకయ్య, ఉపసర్పంచ్ మోతె కావ్య, ఫీల్డ్ అసిస్టెంట్ కాశిపాట రాజయ్య పాల్గొన్నారు.


