మంథని: వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా చే యడంతోపాటు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయకుంటే సబ్‌స్టేషన్లను ముట్టడిస్తామని మంథని మా జీ ఎమ్మెల్యే పుట్ట మధు హెచ్చరించారు. అప్రకటిత విద్యుత్ కోతలు, ఎస్సారెస్పీ నీటి విడుదలలో జా ప్యంతో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొంటూ శుక్రవారం రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక పాతపెట్రోల్ బంకు ఎదుట మంథని – కాటారం ప్రధాన రహదారిపై రాస్తారో కో నిర్వహించారు. పంటలను కాపాడకపోతే రైతు లు నష్టపోయే ప్రమాదం ఉందని, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు రాకుండా ప్రభుత్వం స్పందించాలని కోరారు. నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.


