నేరాల నియంత్రణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు చర్యలు

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

యైటింక్లయిన్‌కాలనీ: నేరాల నియంత్రణపై పో లీసులు ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా ఆదేశించారు. గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణాలో మొక్కలు నాటారు. ఏసీపీ రమేశ్‌, సీఐలు ప్రసాద్‌రావు, లింగమూర్తి పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు అవార్డు

జ్యోతినగర్‌: సమాచార కమిషన్‌ నిర్వహించిన ఆర్టీఐ వారోత్సవాలు–2026 ప్రత్యేక కేటగిరీలో రామగుండం తహసీల్దార్‌ కార్యాలయం ఎంపికై ంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా నుంచి త హసీల్దార్‌ రవీందర్‌రావు అవార్డు అందుకు న్నా రు. ఆయనను పలువురు అభినందించారు.

దివ్యాంగులకు సదుపాయాలు

పెద్దపల్లి: సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగులు తమ సంస్థను ఆశ్రయించాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్‌ సూచించారు. సుల్తానాబాద్‌లోని క్యాడర్‌ దివ్యాంగుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం కో సం సంప్రదిస్తే, ప్రభుత్వం నుంచి సదుపాయా లు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి

పెద్దపల్లి: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ను బర్తరఫ్‌ చేయాలని ముస్లిం ఐక్యవేదిక డి మాండ్‌ చేసింది. జిల్లా కేంద్రంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రతినిధులు మౌలానా మహమ్మద్‌ అజీముద్దీన్‌ అహ్మద్‌, సయ్యద్‌ మ స్రత్‌, అబ్దుల్‌ జావిద్‌, ఎంఏ మొహీద్‌, మీర్జా షంషేర్‌ బేగ్‌, అస్లాం పర్వేజ్‌, సల్మాన్‌, అష్రాఫ్‌, యూనిస్‌ ఖాన్‌, నదీమ్‌, రఫీఉల్లాఖాన్‌, మెహ రాజ్‌, ఇమ్రాన్‌, సదానందం, బాలసాని లెనిన్‌, కల్లేపల్లి నవీన్‌, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నగరంలో లేబర్‌ ఫోర్స్‌ సర్వే

జ్యోతినగర్‌/కోల్‌సిటీ: జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌వో) పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌–2026)కు ప్రజలు సహకరించాలని గణాంక శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. నగరంలో చేపట్టిన సర్వే వివరాలను మున్సిపల్‌ కమిషనర్‌ అరుణశ్రీకి శుక్రవారం వివరించారు. కార్పొరేటర్‌ బొడిగె స్వప్న, వా ర్డు అధికారి రాజేశ్‌, అసిస్టెంట్‌ అధికారి మహే శ్‌, మెప్మా ఆర్‌పీ ధనలక్ష్మి పాల్గొన్నారు.

ఘనంగా దశాబ్ది సంబురాలు

గోదావరిఖని: జిల్లాల దశాబ్ది సంబురాలు ఈ నెల 10, 11వ తేదీల్లో రామగుండంలో ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. యువత, జేఏసీ, జర్నలిస్టులు, ఉద్యమ కారులు భాగస్వామ్యం కావాలని కోరారు.

కూరగాయల సాగు మేలు

పెద్దపల్లిరూరల్‌: కూరగాయల సాగుతో రోజు వారీ ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యానఅధికారి శ్యాంప్రసాద్‌ అన్నారు. పెద్దకల్వలలో బుషనవేణ మహేందర్‌ సాగు చేసిన కూరగాయల తోటను పరిశీలించి సూచనలు చేశారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

జూలపల్లి: వడ్కాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆరోతరగతి విద్యార్థిని జెట్టి అనన్య అండ ర్‌– 12 లాంగ్‌ జంప్‌, జావలిన్‌త్రో పోటీల్లో గోల్డ్‌మెడల్‌ సాధించి రాష్ట్ర స్థాయికి పోటీలకు ఎంపింది. హెచ్‌ఎం దూస రమేశ్‌, పీడీ మహేందర్‌, విద్యార్థులు ఆమెను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement