ప్రతీవాడలో నిఘా నేత్రాలు | - | Sakshi
Sakshi News home page

ప్రతీవాడలో నిఘా నేత్రాలు

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

పెద్దపల్లిరూరల్‌: నేరాల నియంత్రణలో సీసీ కెమెరా ల పాత్ర ఎంతోకీలకమని, వాడవాడలా నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్‌నర్‌ (పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఆఫీసు గల్లీలో) ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, స్థానిక కౌన్సిలర్‌ కొట్టె స్వరూప, సదానందంతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం విప్‌ మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక నాయకులు, ప్రజలు ముందుకు రావాలని కోరారు. నేరాలను నియంత్రించేందుకు ఈ కెమెరాలు దోహదపడతాయని ఆయన వివరించారు. కమిషనర్‌ వెంకటేశ్‌తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement