గోదావరిఖని: సింగరేణి కార్మికులకు ఈనెల 15న దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మి నెంట్ కార్మికులకు రూ.25వేలు, టెంపరరీ కార్మికులకు రూ.12,500 చొప్పున అడ్వాన్స్ చెల్లించనుంది. ఈనెల 20న జరుపుకునే పండుగ ఖర్చు కోసం ఆర్థి క వెసులుబాటు కల్పించేలా సింగరేణి ఏటా ఈ వెసులుబాటు కల్పిస్తోంది.
రైలింజిన్లలో సీసీ కెమెరాలు తొలగించాలి
రామగుండం: రైలింజిన్‌లో సీసీ కెమెరాలను తొలగించాలనే డిమాండ్‌తో స్థా నిక రైల్వేస్టేషన్‌లోని క్య్రూ లాబీ ఎదుట లోకోపైలట్లు శుక్రవారం నిరసన తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పల్లికొండ శంతన్‌కుమార్ మాట్లాడుతూ, లోకో రన్నింగ్ స్టాఫ్ సమస్యలపై రైల్వే ట్రేడ్ యూ నియన్లు విఫలమయ్యాయన్నారు. దసరా పండుగ బోనస్ సీలింగ్‌ను రూ. 18వేలకు పెంచాలని, డిటోనేటర్స్ ఫాగ్‌సేఫ్ డివైస్ లోకోలోనే అమర్చాలని, డివిజనల్, జోనల్ బదిలీలు చేపట్టాలని, రైలింజిన్‌లో ఏసీలను బిగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లోకోపైలట్లు పురుషోత్తం మీనా, దినేశ్‌కుమార్‌మీనా, వినయ్‌కుమార్, సుమన్, మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.


