జ్యోతినగర్: భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాలులు జిల్లావాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడదెబ్బతో అస్వస్థతకు గురైన చాలామంది స్పత్రులకు పరుగెత్తుతున్నారు. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సూరీడు మంగళవారం ఒక్కసారిగా వేడెక్కాడు. ఎండ తీవ్రతతోపాటు ఉక్కపోత పెరిగింది. ఎలిగేడులో పగలు అత్యధికంగా 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా అంతటా 43 నుంచి 45.7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు.. ఎలిగేడు, పాలితం, కమాన్‌పూర్, ఈసాలతక్కళ్లపల్లిలో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఉక్కపోతకు మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉ దయం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రధాన రహదారులపై జనసంచారం తగ్గింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి...
పెద్దపల్లి: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణతోపాటు ఉద్యాన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చే యాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఉద్యా న శాఖ, ఆయిల్‌పామ్ అంశాలపై అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. 2026–27 సంవత్సరానికి జిల్లాలో 1,150 ఎకరాల ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించామని, ఇప్పటివరకు 370 ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు వచ్చి డీడీలు చెల్లించారని పేర్కొన్నారు. కూరగాయలు, పండ్లతోటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. డీహెచ్‌ఎస్‌వో జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
మక్కలను గోదాములకు తరలించాలి
పెద్దపల్లిరూరల్: మార్క్‌ఫెడ్ ద్వారా తూకం వేసిన మక్కలను ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి మండలం రంగాపూర్‌లోని గోదాములను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రంగాపూర్‌లో 5వేల మెట్రిక్ టన్నుల మేర సామర్థ్యం గల గో దాములు అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసేందుకు గోదాముల్లో అ న్‌లోడ్ చేసేందుకు అవసరమైనంత మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మక్కల కొనుగోళ్లు, తూకం, రవాణా ప్రక్రియలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అన్నారు.
HEAT WAVE
ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్‌లో)
మండలం ప్రాంతం కనిష్టం గరిష్టం
ఎలిగేడు ఎలిగేడు 35.6 45.7
పెద్దపల్లి పాలితం 34.2 45.7
కమాన్‌పూర్ కమాన్‌పూర్ 35.6 45.6
పాలకుర్తి ఈసాలతక్కళ్లపల్లి 35.6 45.1
పెద్దపల్లి భోజన్నపేట 34.9 44.9
రామగిరి కల్వచర్ల 34.9 44.9
సుల్తానాబాద్ సుగ్లాంపల్లి 34.6 44.6
ఓదెల ఓదెల 34.2 44.5
ముత్తారం(మంథని) ముత్తారం 34.2 45.5
ధర్మారం ధర్మారం 35.5 44.4
జూలపల్లి జూలపల్లి 35.6 44.3
రామగుండం మల్యాలపల్లి 36.0 44.1
సుల్తానాబాద్ కనుకుల 34.2 43.9
కాల్వశ్రీరాంపూర్ కూనారం 34.2 43.9
కలెక్టర్ కోయ శ్రీహర్ష


