కౌలు రైతులకు స్టాంప్‌ పేపర్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు స్టాంప్‌ పేపర్‌ కష్టాలు

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

పెద్దపల్లి: మక్కలు విక్రయించేందుకు రైతులు ఇ బ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం.. రైతు నుంచి భూములు కౌలుకు తీసుకునే సందర్భంగా కౌలు తీసుకున్నట్లు స్టాంప్‌పేపర్‌పై ఒప్పందం రాసుకోవాలి. చాలాప్రాంతాల్లో నోటిమాటగా నే కౌలు రైతులు యజమానులకు సొమ్ము చెల్లించి పంటలు వేస్తున్నారు. కానీ, దిగుబడి వచ్చాక మార్కెట్‌లో విక్రయించే సమయంలో నిబంధనలు అడ్డురావడంతో సమస్య ఎదుర్కొంటున్నారు.

రికార్డుల్లో లేని కౌలు రైతులు

సాగు వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నా.. పట్టాదారుల కాలంలోని రైతులు పంటలు వేయడంలేదు. వారు తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. కౌలు రైతులు ధాన్యం విక్రయించే సమయంలో ఆ వివరాలు సరిపోలక ఇబ్బందులకు గురవుతున్నా రు. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో 60 వేల మెట్రిక్‌ టన్నుల మక్కల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 9 కేంద్రాలు ఏర్పాటు చేసి కొను గోళ్లు ప్రారంభించారు. సాగు విస్తీర్ణం 18,191 ఎక రాలు ఉండగా.. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఇప్పటివరకు 23 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.

మక్కల విక్రయానికి ఇబ్బందులు

Advertisement
 
Advertisement
Advertisement