సోదరభావంతో మెలగాలి | - | Sakshi
Sakshi News home page

సోదరభావంతో మెలగాలి

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

పెద్దపల్లిరూరల్‌: పౌరులు మతసామరస్యాలను కా పాడుతూ సోదరభావంతో మెలగాలని ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై లక్ష్మణ్‌రావు, నరేశ్‌తో కలిసి మంగళవారం జిల్లా కేంద్రంలో పీస్‌కమిటీ సమావేశం నిర్వహించారు. ఈనెల 28న బక్రీద్‌ సందర్భంగా అందరూ ఐకమత్యంగా, శాంతియుతంగా పండుగ జరుపుకోవాలన్నారు.

23 నుంచి షటిల్‌ పోటీలు

పెద్దపల్లి: గోదావరిఖని ఆర్‌సీవోఏ, సీఈఆర్‌ క్లబ్బు ల్లో ఈనెల 23, 24వ తేదీల్లో జిల్లాస్థాయి షటిల్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. అండర్‌–11, 13, 15, 17, 19తోపాటు ఓపెన్‌ మెన్‌, ఉమెన్‌ విభాగాల్లో పో టీలు ఉంటాయన్నారు. ఆసక్తి గలక్రీడాకారులు ఈ నెల 22న 93965 40067, 91778 85183, 98492 18365 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తప్పనిసరి

పెద్దపల్లి: ఐటీఐలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తప్పనిస రని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేశ్‌ అ న్నారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐలో మంగళవారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. 255 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. సురేశ్‌ మాట్లాడుతూ, పోటీ ప్రపంచంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు అవసరమన్నారు. దేశసేవలో పాలుపంచుకునేందుకు అగ్నివీర్‌, ఆర్మీ, పారామిలిటరీల్లో ఉద్యోగాలు సాధించాలని సూ చించారు. ప్రిన్సిపాల్‌ మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement