గోదావరిఖని/కోల్‌సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల నిజం చేస్తోందని రామగుండం ఎ మ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. గోదావరిఖ ని జవహర్‌నగర్‌లోని 54వ డివిజన్‌లో లబ్ధిదారు చే పట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మేయర్ మ హంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ మంగళవారం భూమిపూజ చేశారు. కార్పొరేటర్ ముస్తఫా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు.
పనిస్థలాల సందర్శన
రామగుండం: ఎమ్మెల్యే ఠాకూర్ ఉపాధి కూలీల ప నిస్థలాలను సందర్శించారు. మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సేవా సమితి తరఫున టోపీలు, గ్లూకోస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పెండ్యాల మహేశ్, బీసీ సెల్ మండల ప్రతినిధి సింగం కిరణ్‌కుమార్, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం తదితరులు పాల్గొన్నారు.


