ఆటోమేషన్‌ .. మానవరహితం | - | Sakshi
Sakshi News home page

ఆటోమేషన్‌ .. మానవరహితం

Apr 8 2026 7:02 AM | Updated on Apr 8 2026 7:02 AM

మెరుగైన సేవలందించేందుకే

పెద్దపల్లిరూరల్‌: వినియోగదారులకు మెరుగైన నా ణ్యమైన విద్యుత్‌ సేవలు నిరంతరం అందించేందుకు ట్రాన్స్‌కో ఆధునిక సాంకేతికతతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే నిరంతరాయంగా విద్యుత్‌ సేవలను ఆందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న అధికారులు.. తాజాగా ‘ఆటోమేషన్‌’ పద్ధతిన సబ్‌స్టేషన్లను నిర్వహించేందుకు శ్రీకా రం చుడుతున్నారు. ఇది అమల్లోకి వస్తే సబ్‌స్టేషన్ల నిర్వహణ కోసం ఉద్యోగ, సిబ్బంది అవసరమే ఉండదు. మానవరహిత సబ్‌స్టేషన్లుగా మారనున్నా యి. ఇందుకోసం జిల్లాలో ప్రయోగాత్మకంగా రామగుండం నియోజకవర్గంలోని గౌతమినగర్‌, రాంమందిర్‌ఏరియా విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో ఈనెల నుంచి అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

తొలివిడతలో 28 సబ్‌స్టేషన్లలో..

జిల్లాలో 69 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. అందులో ఆటోమేషన్‌ పద్ధతిని అమలు చేసేందుకు వీలుగా తొలివిడతలో 28 విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో ఆటోమేషన్‌ పద్ధతికి శ్రీకారం చుడుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. మలివిడతలో మరో 8 విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో ఈ పద్ధతి అమలు కానుందని పేర్కొన్నాయి.

ఆధునికీకరించేందుకు రూ.30 లక్షల ఖర్చు

విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్వహణ, సరఫరా విషయంలో తలెత్తే సాంకేతిక సమస్యలను సులువుగా గుర్తించడమే కాకుండా నేరుగా వరంగల్‌ సర్కిల్‌లోని ఉన్నతాధికారులకు చేరవేసేలా ఆటోమేషన్‌ పద్ధతి(స్కాడర్‌ కంట్రోల్‌రూం) ద్వారా అనుసంధానిస్తారు. ఇందుకోసం ఒక్కోవిద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో రూ.27 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చుచేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం జిల్లాకు ఇప్పటికే రూ.17కోట్లు కేటాయించినట్టు తెలిసింది. ఆటోమేషన్‌ పద్ధతి అమల్లోకి వస్తే సమస్యలను గుర్తించడం చాలా తేలిక అవుతుంది. దీంతో సమయం ఎంతగానో ఆదా అవుతుంది.

సబ్‌స్టేషన్ల నుంచి నిరంతరం విద్యుత్‌ సరఫరా

ఆధునిక సాంకేతితతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

ప్రయోగాత్మకంగ జిల్లాలో రెండు సబ్‌స్టేషన్లలో అమలు

ఉద్యోగ, సిబ్బంది లేకుండానే

ఆటోమేషన్‌ పద్ధతి అమల్లోకి వస్తే సాంకేతికతతోనే సమస్యలను గుర్తించి అందుబాటులో ఉన్న సిబ్బందిని వరంగల్‌ కంట్రోల్‌రూం నుంచి అప్రమత్తం చేసి నేరుగా సమస్య ఉన్న చోటికే వెళ్లి తక్కువ సమయంలోనే పరిష్కా రం చూపేలా చర్యలు తీసుకుంటారు. ఇందు కోసం ఇప్పటికే అవసరమైన వాహనాలు, ఇ తర సదుపాయాలను సైతం సమకూర్చుకున్నారు. ఆటోమేషన్‌ సిస్టం అమలైతే విద్యుత్‌ సబ్‌స్టేషన్లు మానవరహిత సబ్‌స్టేషన్లుగా మా రడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

విద్యుత్‌ వినియోగదారుల కు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్‌ సేవలను అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నా ం. సబ్‌స్టేషన్లలో లేదా ఇతర లైన్లలో తలెత్తే అంతరాయాలను ఆటోమేషన్‌ గుర్తించి వరంగల్‌ కంట్రోల్‌రూంకు, సమీప అధికారులకు వాట్సాప్‌ ద్వార సమాచారం అందిస్తుంది. అక్కడి నుంచి అధికారులు పర్యవేక్షించి సమీప అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చి సమస్యకు పరిష్కారం చూపుతారు.

– గంగాధర్‌, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement