పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి మళ్లీ ఓట్లు అడుగుతానని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ రిక్రియేషన్ క్లబ్‌లో మంగళవారం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం సందర్భంగా గర్రెపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రక్రి య ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ సహకారం అందించింది. విప్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం కడుపుకుంటున్నారన్నారు. సుల్తానాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులు పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ వైస్‌చైర్ పర్సన్ అంతటి పుష్పలత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, కౌన్సి లర్లు చింతల రాజు, గరిగే శోభారాణి, మున్సిపల్ కమిషనర్ రమేశ్, తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, డాక్టర్ ఉదయ్ పాల్గొన్నారు.


