ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మాజీ కాంట్రాక్టర్‌ ఇంటి ఎదుట నిరసన | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మాజీ కాంట్రాక్టర్‌ ఇంటి ఎదుట నిరసన

Apr 8 2026 7:02 AM | Updated on Apr 8 2026 7:02 AM

ఫెర్టిలైజర్‌సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. కాంట్రాక్ట్‌ ఉద్యోగాల పేరిట నగదు తీసుకుని నేటికీ తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మధ్యవర్తి సిలివేరి రవి ఆవేదన చెందాడు. ఈమేరకు మంగళవారం గౌతమినగర్‌లోని మాజీ సబ్‌ కాంట్రాక్టర్‌ గోపగాని మోహన్‌గౌడ్‌ ఇంటిఎదుట కుటుంబ సభ్యులతో నిరసనకు దిగాడు. రవి మాట్లాడుతూ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో రూ.కోటి 30 లక్షలను మోహన్‌గౌడ్‌ తీసుకొని తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు. మధ్యవర్తిత్వం వహించినందుకు బాధితులకు తన సొంత స్థలం అమ్మి డబ్బులు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశాడు. తీసుకున్న డబ్బులు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా వాయిదాల పేరుతో దాటేస్తున్నాడని ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిలివేరి రవిని ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement