వర్సిటీలో సమస్యలపై ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ల నిందలు వేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో యూనివర్సిటీ అకడమిక్ వాతావరణాన్ని దెబ్బ తీస్తున్న వ్యక్తులపై వీసీ, రిజిస్ట్రార్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. జిల్లాలో అర్బన్ నక్సలైట్లు లేరని సీపీ గౌస్ ఆలం ప్రకటనను స్వాగతిస్తున్నాం. పోలీస్ ఉన్నతాధికారులు ఒకవైపు కరీంనగర్ లో అర్బన్ నక్సలైట్లు ఎవరూ లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.
– అరవింద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
వర్సిటీ ప్రతిష్టకు విఘాతం
పోలీస్ ఉన్నతాధికారులు కరీంనగర్‌లో అర్బన్ నక్సలైట్లు లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై యూనివర్సిటీ ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వర్సిటీలో ఇష్టానుసార నియామకాలు, కొత్త నిర్మాణాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి అవకతవకలను ప్రశ్నిస్తే ఇలా అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ ప్రకటనలు చేయడం వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉంది.
– మణికంఠరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
లీగల్ నోటీసులు పంపుతున్నాం
కొందరు పనిగట్టుకుని వర్సి టీలో దళిత సిబ్బంది, విద్యార్థులపై అర్బన్ నక్సలైట్లంటూ విషప్రచారం చేస్తున్నా రు. అందుకే, ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశాను. ఈ దుష్ప్రచారానికి కారకులను గుర్తించి లీగల్ నోటీసులు పంపుతున్నాం. సివిల్, క్రిమినల్ చర్యలకూ వెనకాడేది లేదు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, వ్యక్తిత్వ హననంపై వెనక్కి తగ్గేది లే దు. వర్సిటీలో దళితులపై జరుగుతున్న అకృత్యాలపై సోమవారం పోలీసులకు కూడా ఫి ర్యాదు చేస్తాం. – ప్రొఫెసర్ సుజాత,
సోషియాలజీ విభాగాధిపతి


